
న్యూస్

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ తాజాగా కువైట్ కు చెందిన చమురు ట్యాంకర్ పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అల్ సల్మీ పేరుతో ఉన్న భారీ ముడి చమురు నౌక దుబాయ్ పోర్టు సమీపంలో నిలిచివుండగా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా ట్యాంకర్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు వెంటనే చర్యలు చేపట్టాయి.
ట్యాంకర్‌లో ఉన్న 24 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే నౌకలో పెద్ద మొత్తంలో ముడి చమురు ఉండటంతో సముద్రంలో లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనను దుబాయ్ అధికారులు కూడా నిర్ధారించగా, మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!