
గాసిప్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆహార కల్తీని నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈగల్, హైడ్రా తరహాలోనే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దేశంలో అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి అందిస్తున్న సన్న బియ్యం పథకం ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పేదలకు ఉపయోగం లేకుండా ఉన్న దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చే మాఫియాను అరికట్టేందుకు ఈ పథకం ప్రారంభించామని తెలిపారు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి సన్నవడ్లు పండించేలా ప్రోత్సహిస్తున్నామని, అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే లక్ష్యమని చెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!