
సినిమాలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి సంవత్సరం డిసెంబర్లో శీతాకాల విహారం (Winter Resort) కోసం హైదరాబాద్లో ఉంటారు. ఈ ఏడాది కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రపతి 17 డిసెంబర్ 2025న హైదరాబాద్ చేరనున్నారు. కాంటోన్మెంట్ ప్రాంతంలో బొల్లారంలోని రాష్ట్రపతి నివాసం ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం, ఆమె మొత్తం ఐదు రోజుల పాటు నగరంలో ఉండనున్నారు.
ఈ పర్యటనలో రాష్ట్రపతి అనేక ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. డిసెంబర్ 19న రామోజీ ఫిల్మ్ సిటీలో, 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 21న, ఆమె వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, అనంతరం టి విందులో పాల్గొననున్నారు. చివరగా, డిసెంబర్ 22 ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!