
గాసిప్స్

గుంటూరు జిల్లాలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబు ఇంటి వద్ద ఆయన కార్యాలయం వద్ద కూడా పోలీసులు పహారాకాస్తున్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
అంబటి రాంబాబు కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలులో భాగంగా అంబటి కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!