
సినిమాలు

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దిబ్రూగఢ్‌లోని మోరాన్ బైపాస్ సమీపంలో చారిత్రక ఘట్టానికి సాక్ష్యమయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో వచ్చిన ఆయన ప్రయాణించిన విమానం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై విజయవంతంగా ల్యాండ్ అయింది. రోడ్డుపైనే విమానం దిగడం అరుదైన ఘటనగా నిలిచింది.
ఈశాన్య భారతంలో ఇదే తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యం కావడం విశేషం. అత్యవసర పరిస్థితుల్లో విమానాల ల్యాండింగ్‌కు వీలుగా ఈ సదుపాయాన్ని నిర్మించారు. ఇది ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు జాతీయ భద్రతా సన్నద్ధతను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!