

విశాఖపట్నం ఆర్కే బీచ్లో పెసా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు మరియు భారీగా ఉద్యోగులు పాల్గొన్నారు. డిసెంబర్ 23, 24 తేదీల్లో జరిగే ఈ మహోత్సవంలో దేశంలోని 10 రాష్ట్రాల నుంచి 1500 మంది గిరిజన క్రీడాకారులు పాల్గొంటారు. పోర్ట్ స్టేడియంలో కబడ్డీ ఫైనల్, ఇండోర్-ఔట్డోర్ స్టేడియాల్లో వివిధ క్రీడా పోటీలు, 200 పైగా స్టాల్స్, సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పెసా (PESA) చట్టం 1996 లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ విస్తరణ కోసం ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ద్వారా గిరిజనుల భూములు, సహజ వనరులను పరిరక్షించుకునే అధికారాన్ని కల్పిస్తుంది. పెసా మహోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం చట్టంపై అవగాహన పెంచడం, గిరిజనుల హక్కులను రక్షించడం, వారి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం. గత సంవత్సరం మహారాష్ట్రలో ఈ మహోత్సవం నిర్వహించబడింది, ఈ సంవత్సరం విశాఖ వేదికగా జరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!