
గాసిప్స్

సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో తన పేరు, ఫోటోలను అక్రమంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు, ఐటీ రూల్స్ 2021 కింద సంబంధిత ప్లాట్‌ఫామ్‌లపై మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన డిజిటల్ యుగంలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ అనీష్ డయాల్, తీసుకున్న చర్యలపై నివేదికను కోర్టుకు అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 22 కు వాయిదా వేశారు. ఆ రోజున సవివరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ తరఫు న్యాయవాదులు, భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.


.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!