
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మ విశ్వాసాన్ని మరోసారి బహిరంగంగా చాటుకున్నారు. పిఠాపురంలో నిర్వహించిన ప్రీ–సంక్రాంతి వేడుకల సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బహూకరించిన శ్రీ బాలాజీ విగ్రహాన్ని భక్తితో స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని తలపై ఉంచుకుని తన ఆధ్యాత్మిక భావనను వ్యక్తపరిచారు.
ఈ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. హిందుత్వ భావజాలం, సనాతన ధర్మంపై తన నిబద్ధతను పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టంగా చూపించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్వర స్వామిపై ఆయనకు ఉన్న భక్తిని ప్రతిబింబించే ఈ ఫోటోలు నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!