

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్యకు విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చాడు. సుమారు ₹4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను అందజేసినట్లు ల్యాండ్ రోవర్ ముంబై బ్రాంచ్ వెల్లడించింది. ఈ కారు కొనుగోలుకు పాండ్యా మళ్లీ నవ్నిత్ మోటార్స్‌ను ఎంచుకున్నారని డీలర్ తెలిపింది. నటాషా, అగస్త్య స్వయంగా షోరూమ్‌కు వెళ్లి కారును తీసుకోవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విడిపోయినప్పటికీ మాజీ భార్యపై గౌరవం, కొడుకుపై ప్రేమను పాండ్యా నిలబెట్టాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
డివోర్స్ అనంతరం కూడా అగస్త్య విషయంలో ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అభిమానులు అంటున్నారు. 2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో ప్రేమను ప్రకటించిన ఈ జంట తర్వాత వివాహం చేసుకుని 2020 జూలైలో అగస్త్యకు జన్మనిచ్చింది. 2023 ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో ఘనంగా మళ్లీ పెళ్లి చేసుకున్నప్పటికీ, 2024 జూలైలో విడిపోయారు. విడాకుల తర్వాత పాండ్యా పేరు మోడల్ మిహికా శర్మతో వినిపిస్తున్నప్పటికీ, తన కుమారుడే తనకు అత్యంత ప్రాధాన్యత అని మరోసారి నిరూపించాడని అభిమానులు అంటున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!