
సినిమాలు

భారత్–యురోపియన్ యూనియన్ మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం తమ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశముందని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈయూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ ప్రకటించింది. ఈ ఒప్పందంలోని అంశాలపై తమకు పూర్తి అవగాహన ఉందని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మీడియా సమావేశంలో తెలిపారు.
పాకిస్థాన్‌కు అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఈయూ కొనసాగుతోంది. తాజా వాణిజ్య ఒప్పందం కారణంగా యూరోపియన్ మార్కెట్లో తమ ఆధిపత్యం తగ్గిపోతుందేమోనన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో నెలకొంది. 2014లో ఈయూ పాకిస్థాన్‌కు ఇచ్చిన జీఎస్పీ+ హోదా వల్ల టెక్స్టైల్స్ ఎగుమతులు 108 శాతం పెరిగాయని, ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 12 బిలియన్ యూరోలకు చేరిందని అంద్రాబీ గుర్తు చేశారు. అయితే ఈ హోదా గడువు వచ్చే ఏడాది డిసెంబరుతో ముగియనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!