
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షలకుపైగా ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. హౌసింగ్, వ్యవసాయ బడ్జెట్ చర్చలో భాగంగా ఇప్పటికే సుమారు 3 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఉగాది, జూన్, సెప్టెంబర్ నాటికి దశలవారీగా మరిన్ని ఇళ్లలో గృహప్రవేశాలు జరిపేలా లక్ష్యాలు నిర్ధేశించినట్లు చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో గృహ నిర్మాణం, ఇసుక విధానాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంటి స్థలాలు లేని 2.20 లక్షల కుటుంబాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు, స్థలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!