
బిజినెస్

దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో అమర్చిన లక్షకు పైగా సీసీ కెమెరాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇవన్నీ చైనాలో తయారైనవి కావడంతో జాతీయ భద్రతకు ముప్పు ఉండొచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి స్థానంలో కొత్త సురక్షిత కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ సీసీ కెమెరాలు 2020 నుంచి 2022 వరకు మొదటి దశలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దిల్లీ నగరంలో మొత్తం రెండు లక్షల ఏడు వేల సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. భద్రతను మెరుగుపరచడం కోసం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పాత కెమెరాల స్థానంలో త్వరలోనే కొత్త కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.












.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!