

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమాపై తాను చేసిన వ్యాఖ్యల పై వస్తున్న చర్చలకు సీనియర్ నటి రాశి స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె చెప్పారు. ప్రభాస్‌కు తల్లి పాత్రలో కాకుండా ఇతర పాత్రల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ సోదరి పాత్ర చేయనని ఎక్కడా చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేరే విధంగా ప్రచారం కావడంతో ఈ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన అనుమాన పక్షి సినిమా కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, గతంలో ప్రభాస్ సినిమాలకు డబ్బింగ్ చెప్పినా ఆయన్ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదని తెలిపారు. డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తన పాత్ర నచ్చి వెంటనే ఒప్పుకున్నానని చెప్పారు. హీరోయిన్‌గా అనేక చిత్రాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా విజయంపై నమ్మకం ఉందని తెలిపారు.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!