

ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్ విద్యార్థులకు నవంబర్ నెల ప్రశాంతంగానే ఉండనుంది. గత నెలల్లో తుఫాన్, దసరా, వరుస సెలవులతో ఆనందించిన విద్యార్థులకు ఈసారి పెద్దగా విరామం దొరకడం లేదు. నవంబర్ నెలలో మొత్తం ఆరు రోజులే సెలవులు ఉండగా, 25 రోజులు వర్కింగ్ డేస్‌గా ఉండనున్నాయి.
వివరాలు ఇలా ఉన్నాయి:
నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారాలు
నవంబర్ 8న రెండో శనివారం
నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి (ఆప్షనల్ హాలిడే)
నవంబర్ 6న హజరత్ సయ్యద్ మొహ్మద్ జువాన్‌పూర్ మెహిదీ జయంతి (ఆప్షనల్ హాలిడే)
గత నెల అక్టోబర్‌లో తుఫాన్ ప్రభావంతో స్కూళ్లకు నాలుగు రోజుల వరుస సెలవులు ప్రకటించగా, దాని ముందు సెప్టెంబర్‌లో దసరా బ్రేక్‌తో విద్యార్థులు పండగ మూడ్‌లో గడిపారు. ఆగస్టు నెలలో కూడా పది రోజులపాటు స్కూళ్లు మూసివేశారు.
కానీ ఈ నవంబర్ మాత్రం పెద్దగా పండుగలు లేకుండా కూల్‌గా గడవనుంది. డిసెంబర్లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి సెలవులు మళ్లీ విద్యార్థులకు రిలీఫ్‌గా రానున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!