

తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనుండగా, 4,023 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 75,064 కేంద్రాలు ఏర్పాటు చేయగా, భద్రత కోసం 85,875 మంది పోలీసులు మోహరించారు.
ఇక పశ్చిమ బెంగాల్‌లో రేపు తొలివిడత పోలింగ్ జరగనుంది. 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించనుండగా, 1,478 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 2.5 లక్షల కేంద్ర బలగాలను మోహరించారు. అదేవిధంగా 8 వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!