
రాజకీయాలు

భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ప్రభుత్వం ఊరట కల్పించింది. తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్ వీసాలు, స్టడీ పర్మిట్లు, సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాలను తగ్గిస్తూ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఈ విషయాన్ని కెనడా ఇమిగ్రేషన్ శాఖ తాజాగా వెల్లడించింది.
కొత్త మార్పుల ప్రకారం విజిటర్ వీసా ప్రాసెసింగ్ సమయం 37 రోజుల నుంచి 23 రోజులకు తగ్గించబడింది. స్టడీ పర్మిట్ వీసా ప్రాసెసింగ్ 4 వారాల నుంచి 3 వారాలకు తగ్గింది. అలాగే సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయం 202 రోజుల నుంచి 182 రోజులకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక వీసా కేటగిరీల్లో ఈ మార్పులు ప్రగతిని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. దరఖాస్తుల సంఖ్య, వీసా రకం, పనిభారం ఆధారంగా ప్రాసెసింగ్ సమయం మారుతుందని కెనడా అధికారులు స్పష్టం చేశారు.







.jpeg&w=3840&q=75)













.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!