
న్యూస్

తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీలో రద్దయిన పాత కరెన్సీ నోట్లు భారీగా చేరుతున్నాయి. భక్తులు ఇప్పటికీ చెల్లని రూ.500, రూ.1000 నోట్లను భక్తితో వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు వద్ద ప్రస్తుతం సుమారు రూ.400 కోట్లకు పైగా విలువైన పాత నోట్లు నిల్వ ఉన్నాయని సమాచారం.
ఈ నోట్ల మార్పిడి కోసం టీటీడీ అధికారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా అనుమతి లభించలేదు. దీంతో ఈ మొత్తం ఖజానాలోనే నిలిచిపోయి ఆర్థికంగా భారంగా మారింది. భక్తుల కానుకలు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!