
న్యూస్

సీనియర్ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులోనూ తన క్రమశిక్షణ, అంకితభావంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నో ఏళ్ల పాటు బాలీవుడ్‌ను ఏలిన ఈ మహానటుడు, ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన విజయానికి కారణం తన పనిపట్ల ఉన్న అచంచలమైన నిబద్ధత.
తాజాగా తన బ్లాగ్‌లో ఆయన పని పట్ల ఉన్న ప్రేమను వెల్లడిస్తూ, పని లేకుండా ఉండటం తనకు అసహనంగా అనిపిస్తుందని చెప్పారు. ప్రతిరోజూ ఒక ప్లాన్ ప్రకారం సాగాల్సిన తన షెడ్యూల్‌లో మార్పులు వచ్చినప్పుడు ఆందోళన కలుగుతుందని తెలిపారు. ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి 17 వ సీజన్ ముగింపు సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆయన, కల్కి 2898 ఏడీలో అశ్వత్థామ పాత్రతో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!