.jpg&w=3840&q=75)
రాజకీయాలు

ఇంధన ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్ మరియు పార్కింగ్ కోసం వసూలు చేసే చార్జీలను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తగ్గింపు మూడు నెలల పాటు అమల్లో ఉండనుంది.
ఈ నిర్ణయంతో విమానాశ్రయ నిర్వాహకులకు కలిగే ఆదాయ నష్టాన్ని భవిష్యత్తులో చార్జీల సవరణ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో దేశీయ విమానయాన సంస్థలకు సుమారు రూ.400 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!