.jpg&w=3840&q=75)

సైబర్ కేటుగాళ్లు సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే, సైబర్ మోసానికి గురయ్యారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అదనపు కార్యదర్శి పేరుతో ఫోన్ చేసిన కేటుగాడు “వికసిత్ భారత్” అనే కేంద్ర పథకం పేరుతో మోసం చేశాడు. నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మి ఎమ్మెల్యే ఆ వ్యక్తితో మాట్లాడి వివరాలు ఇచ్చారు.
ఒక్కో లబ్ధిదారుడికి ₹5 నుంచి ₹10 లక్షలు అందుతాయని చెప్పి, ఒక్కో దరఖాస్తుకు ₹2,500 చొప్పున మొత్తం లక్ష రూపాయలు పంపించాలని కేటుగాడు కోరాడు. వెంటనే ఫోన్‌పే ద్వారా డబ్బు పంపిన ఎమ్మెల్యేకు తర్వాత స్పందన లేకపోవడంతో మోసం జరిగిందని గ్రహించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, బ్యాంకు అధికారులతో మాట్లాడి డబ్బును ఆపించారు. ఈ సందర్భంగా ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!