.jpg&w=3840&q=75)
రాజకీయాలు

తెలంగాణలో ఈ నెల 12 నుంచి 22 వరకు తీవ్రమైన ఎండల పరిస్థితులు నెలకొననున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40°C పైగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ కాలంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్లో కూడా దాదాపు 10 రోజుల పాటు 40°C నుంచి 41°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. వర్షాలు చాలా తక్కువగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం నివారించాలని, ఎక్కువగా నీరు తాగాలని అధికారులు సూచిస్తున్నారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!