

ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారు ఆటో పే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, సిప్‌లు, బీమా వంటి సేవల కోసం మనం ఆటో పే సెట్ చేస్తాం. కానీ వాటిని తర్వాత క్యాన్సిల్ చేయడం మర్చిపోతే, ప్రతి నెలా లేదా సంవత్సరానికి ఒకసారి మనకు తెలియకుండానే డబ్బులు కట్ అవుతుంటాయి.
ఈ సమస్యను నివారించడానికి యూపీఐలో సెట్ చేసిన అన్ని ఆటో పే మాండేట్లను ఒకే చోట చూసే అవకాశం ఉంది. దీనికోసం అధికారిక NPCI వెబ్సైట్లోకి వెళ్లి, మీ మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. అక్కడ ‘షో మై ఆటో-పే మాండేట్స్’ అనే ఆప్షన్ ద్వారా మీ యూపీఐకి లింక్ అయిన అన్ని సబ్స్క్రిప్షన్ల జాబితాను చూడవచ్చు.
అవసరం లేని ఆటో పేలను ‘పాజ్’ లేదా ‘రివోక్’ చేయడం ద్వారా అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ నుండి డబ్బులు అనుకోకుండా తగ్గిపోకుండా ఉంటుంది. కాబట్టి యూజర్లు తరచుగా తమ ఆటో పే సెట్టింగ్స్‌ను చెక్ చేసుకోవడం చాలా అవసరం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!