.jpg&w=3840&q=75)
రాజకీయాలు

ధర్మపురి అర్వింద్ తాజా రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత పార్టీ కార్యకలాపాలకు రేవంత్ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీల మద్దతుతో బీజేపీ రాష్ట్రంలో మరింత బలపడుతోందని అర్వింద్ పేర్కొన్నారు. అలాగే, రాజకీయ పరిణామాలను సరిగా అంచనా వేయకుండా జీవన్ రెడ్డి తొందరపడి పార్టీ మారుతున్నారని విమర్శించారు.
ఇక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై కూడా అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు వస్తాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు డాక్టర్ శ్రావణిని పంపించారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత జీవన్ రెడ్డిని కూడా అదే పరిస్థితికి నెట్టేశారని ఆరోపించారు. చివరికి సంజయ్ మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని అర్వింద్ పేర్కొన్నారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!