

హీరోయిన్ అనుష్క శెట్టి చాలా కాలంగా బయట కార్యక్రమాల్లో కనిపించడం లేదు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటోంది. సైజ్ జీరో సినిమా చేసిన తర్వాత బరువు సమస్యలు రావడంతో సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ప్రచార కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటుంది. గత ఏడాది ఘాటీ సినిమాలో నటించినప్పుడు అయినా కనిపిస్తుందేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ సినిమాల్లో మాత్రమే నటించిన అనుష్క తాజాగా మలయాళంలో కథనార్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల కాగా అందులో ఆమె కొద్దిసేపే కనిపించడం అభిమానులను నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ప్రచారం కోసం ఆమె హైదరాబాద్కు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై చాలా మందికి సందేహం ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలకు కూడా ఆమె ప్రచారం చేయలేదు. అలాంటిది మలయాళ డబ్బింగ్ సినిమా కోసం వస్తుందా అనే ప్రశ్న ఉంది. ఈ సినిమా ఈ ఏడాది రెండో భాగంలో విడుదల అవుతుందని చెప్పారు కానీ ఖచ్చితమైన నెల ఇంకా ప్రకటించలేదు. ఈ కథ తొమ్మిదవ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతప్రచారకుడి జీవితంపై ఆధారంగా తెరకెక్కుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!