.jpg&w=3840&q=75)
రాజకీయాలు

వై.ఎస్. షర్మిల, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి జీవితాంతం వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీతో జగన్ దగ్గరవుతున్నారని ఆమె ఆరోపించారు. వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరుతో రుషికొండలో సొంత ప్రయోజనాల కోసం నిర్మాణాలు చేపట్టారని విమర్శించారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ, జగన్‌ను “మావిగన్ జోకర్”గా పేర్కొంటూ రాజకీయ విమర్శలను మరింత ముదిర్చారు. సంక్షేమానికి అసలైన సారథి వైఎస్సార్ అని కొనియాడిన ఆమె, ఆయన అమలు చేసిన ప్రతి పథకం ప్రజల కష్టం, కన్నీళ్ల నుంచి పుట్టిందని పేర్కొన్నారు. షర్మిల విడుదల చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!