

ఇండిగోలో ఏర్పడిన కార్యకలాపాల సమస్యల పై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఇండిగో సేవలు క్రమంగా స్థిరపడుతున్నాయని, అన్ని భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ప్రణాళికా లోపాలు, నిబంధనల ఉల్లంఘనల వల్లే ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. దీని పై ఇప్పటికే ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఏ సంస్థనైనా ప్రభుత్వం ఉపేక్షించదని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టంగా హెచ్చరించారు. ఈ సంక్షోభం నేపథ్యంలో పార్లమెంట్లో ఆయన ఇచ్చిన ఈ స్ట్రాంగ్ మెసేజ్ విమానయాన రంగం పై కేంద్రం గట్టి నిశ్చయంతో ఉండటాన్ని ప్రతిబింబిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇతర ఎయిర్లైన్స్ కార్యకలాపాలు సజావుగా నడుస్తున్నాయని, విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణీకులకు రీఫండ్, బ్యాగేజ్ అందజేయడం వంటి సహాయక చర్యలను వేగంగా చేపడుతున్నామని, డీజీసీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!