
సినిమాలు

భారత్ పెట్రోలియం దేశంలో ఇంధన కొరత ఉందన్న పుకార్లను పూర్తిగా ఖండించింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన లభ్యత సమృద్ధిగా ఉందని, భారత్ పెట్రోల్, డీజిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉందని వెల్లడించింది.

ముడి చమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ ఎక్కడా అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతోందని తెలిపింది. సంస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తూ నిరంతరాయంగా ఇంధన సరఫరాను అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొంది. ప్రజలు భయాందోళనలకు గురై అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దని, పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులోనే ఉందని సూచించింది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!