

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హోరు కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రజలకు 10 కీలక హామీలు ప్రకటించారు.
మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ, జనరల్ కేటగిరీ మహిళలకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ మహిళలకు రూ.1700 అందిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ.1500 సాయం ఇస్తామని తెలిపారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా, పాఠశాలలను ఆధునికీకరించి ఈ-లెర్నింగ్ సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కొత్తగా 7 జిల్లాలు ఏర్పాటు చేసి, రైతుల కోసం రూ.30వేల కోట్ల వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇల్లు, శుద్ధి చేసిన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం NRC, జనగణన పేరుతో ప్రజల పౌరసత్వంపై ప్రభావం చూపే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపెట్టినా లేదా డబ్బులతో ప్రలోభపెట్టినా మోసపోవద్దని పిలుపునిచ్చారు. అన్ని మతాల ప్రజలు తనకు సమానమని తెలిపారు. బెంగాల్‌లో వచ్చే నెల 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4 న ఫలితాలు వెలువడనున్నాయి.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!