
న్యూస్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని కోర్టులకు ఈరోజు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో కలకలం రేగింది. మచిలీపట్నం జిల్లా కోర్టు, ములుగు జిల్లా కోర్టులను లక్ష్యంగా చేసుకుని ఒకే విధంగా మెయిల్స్ పంపారు. మచిలీపట్నంలో మెయిల్ రావడంతో వెంటనే కోర్టును ఖాళీ చేయించారు. న్యాయమూర్తులు, లాయర్లు, కక్షిదారులు భయంతో బయటకు వెళ్లిపోయారు. దీంతో కోర్టు పనులు కొంతసేపు ఆగిపోయాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. ములుగు కోర్టులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది, లాయర్లు బయటకు వెళ్లిపోయారు. డాగ్ స్క్వాడ్‌తో కోర్టు గదులు, రికార్డు రూమ్‌లను పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఈ మెయిల్స్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!