

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. ఈ ప్రణాళికలో అణ్వాయుధాల తయారీ నిలిపివేత, యురేనియం శుద్ధి ఆపివేయడం, ముఖ్య అణుకేంద్రాల నిర్మూలన వంటి అంశాలు ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేసి, పౌర అణు శక్తి రంగంలో సహకారం అందించడానికి సిద్ధమైంది. అయితే ఇరాన్ మాత్రం తనపై ఉన్న అన్ని ఆంక్షలను పూర్తిగా తొలగించడం, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలను మూసివేయడం వంటి డిమాండ్లను ముందుకు తెచ్చింది.
ఇక ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, ఇరాన్ గల్ఫ్ దేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతిస్పందిస్తోంది. అమెరికా అదనపు సైనిక దళాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాలు తమ వైఖరిని మార్చే సూచనలు కనిపించడం లేదు. హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!