

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చలనం వేగం పెరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆశావహులు తమ గెలుపు అవకాశాలను అంచనా వేయించుకోవడానికి సైలెంట్‌గా సర్వేలు చేయిస్తున్నారు. ప్రజల్లో తమ బలం ఎంత ఉందో తెలుసుకునేందుకు పేరున్న సర్వే సంస్థలను సంప్రదిస్తున్నారు.
ప్రతి డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పలువురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో పోటీ తీవ్రంగా మారింది. ప్రజల్లో బలం ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా సర్వే సంస్థల కార్యాలయాలు నాయకులతో సందడిగా మారాయి. అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి తమకు అనుకూలంగా నివేదికలు, ప్రచార సూచనలు పొందుతున్నారు.
ఇక టికెట్ కోసం స్థానిక నాయకులు పార్టీ పెద్దలను కలుస్తూ తమ బలాలను వివరించుకుంటున్నారు. తమకు ఆర్థిక శక్తి, ప్రజల మద్దతు ఉందని చెప్పుకుంటూ ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశంతో అందరూ ముందుగానే సిద్ధమవుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!