

వాట్సాప్‌లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ అనే కొత్త రకమైన మోసం జరుగుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. “Hey.. మీ ఫోటో చూశారా?” లేదా “Hey, ఇప్పుడే మీ ఫోటో దొరికింది!” అంటూ వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సూచించారు.
ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మీ వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల డివైస్‌కు కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయిన తర్వాత, మీ వ్యక్తిగత సమాచారం చూసి, మీ పేరుతోనే ఇతరులకు మెసేజ్‌లు పంపి మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ మోసాల నుంచి రక్షణ పొందాలంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ‘Linked Devices’ ఆప్షన్‌ను తరచూ చెక్ చేయాలని సూచించారు. తెలియని లేదా అనుమానాస్పద డివైస్‌లు కనపడితే వెంటనే రిమూవ్ చేయాలని సజ్జనార్ ట్వీట్ ద్వారా ప్రజలకు సూచించారు.
సజ్జనార్ కీలక సూచనలు:
తెలియని లేదా సందేహాస్పద లింకులు ఎప్పుడూ క్లిక్ చేయవద్దు, తెలిసిన వారినుంచి వచ్చినా కూడా ముందుగా కాల్ లేదా వెరిఫికేషన్ చేసుకోవాలి, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్‌కు సమాచారమివ్వాలి, స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగినకొద్దీ ఇలాంటి మోసాలు మరింత చాకచక్యంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. డిజిటల్ భద్రత ఇప్పుడు వ్యక్తిగత భద్రతంతే కీలకమయింది చిన్న అజాగ్రత్త పెద్ద నష్టానికి దారి తీస్తుందని సజ్జనార్ హెచ్చరికలు గుర్తు చేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!