
గాసిప్స్

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు ఈ రోజు ఒకరోజు సమ్మెకు దిగడంతో యాప్ ఆధారిత సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు నిలిచిపోనున్నాయి. అదే విధంగా జెప్టో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ యాప్స్ అనేక ప్రాంతాల్లో “నో సర్వీస్” సందేశాలను చూపిస్తున్నాయి. ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సేవలు కూడా పరిమితంగా అందుబాటులో ఉండనున్నాయి.
లాజిస్టిక్స్, ఈ-కామర్స్ డెలివరీలు, గృహ అవసర సేవలు సహా పలు రంగాలపై ఈ సమ్మె ప్రభావం చూపనుంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా గిగ్ యాప్స్ నుంచి లాగౌట్ అవుతున్నారు. దీనివల్ల డెలివరీలు, వాహన రైడ్లు, అలాగే హోమ్ సర్వీసులు పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!