

ఐబొమ్మ రవి తన పేరు, తన పై వస్తున్న ఆరోపణల పై మీడియా పై తీవ్రంగా స్పందించాడు. “ఐబొమ్మ నాది అని మీకు ఎవరు చెప్పారు?” అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించాడు. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ సోమవారం తో ముగియడం తో, పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రిమాండ్ విధించడం తో అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు.
కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగగా, వాటికి సమాధానాలివ్వకుండా తిరిగి ప్రశ్నలు సంధించాడు. “నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశానని మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా?” అని అడిగాడు. పోలీసులు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావని, మీడియా కోర్టు కాదని, తాను కోర్టులోనే మాట్లాడతానని స్పష్టం చేశాడు.
విదేశాలకు ఎందుకు పారిపోయారని, పైరసీ చేసినట్లు అంగీకరిస్తారా అనే ప్రశ్నలకు స్పందిస్తూ, తాను ఎక్కడికీ పారిపోలేదని, కూకట్పల్లిలోనే ఉంటున్నానని తెలిపాడు.

.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!