
సినిమాలు

మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు హక్కుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగాలంటే సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటరుగా తప్పనిసరిగా నమోదు కావాలని పేర్కొంది. హైకోర్టు తీర్పు మేరకు అర్హత నిబంధనలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాలేని రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకోలేరని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల అనంతరం కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ పంపింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!