

దక్షిణాది నిర్మాణ సంస్థలు ప్రస్తుతం భాషా సరిహద్దులను దాటుతూ ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే తమిళం, హిందీ సినిమాల్లో అడుగుపెట్టగా, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
మైత్రీ సంస్థ నిర్మించిన తమిళ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” అజిత్‌కు భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాకు ఆయనకు రికార్డు స్థాయిలో రూ.165 కోట్ల పారితోషికం చెల్లించినట్లు సమాచారం. అయితే అదే దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌తో చేయాల్సిన తదుపరి సినిమా ఇప్పుడు ఆర్థిక కారణాలతో ఇబ్బందుల్లో పడింది.
ఈ ప్రాజెక్ట్‌ను మొదటగా చేయాల్సిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అధిక పారితోషికం, పెరుగుతున్న బడ్జెట్ కారణంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఆలస్యమవుతోంది. అజిత్ తన పారితోషికాన్ని తగ్గించుకోవాలి లేదా డిమాండ్‌కు అనుగుణంగా పెట్టుబడి పెట్టే కొత్త నిర్మాణ సంస్థతో సినిమా చేయాల్సి ఉంటుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!