
న్యూస్

మూసి పునర్జీవనం ప్రాజెక్ట్‌లో తమను భాగస్వాములను చేయాలని మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన ఈ భేటీలో, అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నామని, అయితే నిర్వాసితులుగా తమకు న్యాయం చేయాలని వారు తెలిపారు. పునరావాసానికి సంబంధించి మూడు ప్రతిపాదనలు సమర్పిస్తూ వాటిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
వారి వినతిపై స్పందించిన డిప్యూటీ సీఎం, ప్రతిపాదనలను మానవీయ దృక్పథంతో పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సంబంధిత అధికారులను ఈ అంశంపై నివేదిక సిద్ధం చేసి క్యాబినెట్ సబ్ కమిటీకి అందించాలని ఆదేశించారు.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!