

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. తొలి దశగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనుండగా, నేడు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
నామినేషన్ల తొలి రోజే రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న 2,996 వార్డుల కోసం 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు సమర్పించారు. ఈసారి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల అర్హతలు, డిపాజిట్ మొత్తాలు, ఎన్నికల ఖర్చుల పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!