
న్యూస్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక వంటి కీలక పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ నెల 27న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం, జనవరి 28న ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మార్చి నెలలోపే మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!