
తమిళనాడులోని చెన్నై నగరంలో పలు ఇంధన కేంద్రాల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో చేరి క్యూలు కట్టారు. వేలచెరి, టీ నగర్, అన్నా నగర్ ప్రాంతాల్లో వాహనాల పొడవైన వరుసలు కనిపించాయి.
పెట్రోలు, డీజిల్ కొరత లేదని అధికారులు స్పష్టం చేసినప్పటికీ ప్రజలు ఆందోళనతో ఇంధనం నింపించుకునేందుకు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంధన కేంద్రాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!