

నటి చాహత్ ఖన్నా కెమికల్స్, ఇంజెక్టబుల్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ ధ్యానం, చక్ర హీలింగ్ ద్వారా తన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వెల్నెస్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. శారీరక సమస్యలకు మూల కారణాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో మొదలైన ఆమె ప్రయాణం, క్రమంగా ఆయుర్వేదం మరియు సహజ జీవనశైలిని స్వీకరించే దిశగా మారింది.
చాహత్ తన రోజువారీ జీవనశైలిలో అనేక మార్పులు చేశారు. సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయడం, మద్యం పూర్తిగా మానేయడం వంటి అలవాట్లను పాటిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ పాత్రలను వదిలి వెండి, రాగి, కాంస్య, ఇనుప పాత్రలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక శక్తి తరంగం ఉంటుందని, అది మన శరీర శక్తితో అనుసంధానమవుతుందని ఆమె నమ్ముతున్నారు. చక్ర హీలింగ్ ద్వారా తన శక్తి స్థాయులను సమతుల్యం చేసుకుంటూ ఉత్సాహంగా జీవిస్తున్నట్లు చెప్పారు.
అలాగే కృత్రిమ అందాన్ని పెంచే ఇంజెక్టబుల్స్, కెమికల్ ఆధారిత బ్యూటీ ట్రీట్మెంట్లకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు చాహత్ తెలిపారు. తన శరీరంలోకి ఎటువంటి రసాయనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయుర్వేదానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తన శరీరం చెప్పే సంకేతాలను వినడం అలవాటుగా మార్చుకున్నానని, ఏది తనకు సరిపోతుందో, ఏది కాదో తన శరీరమే సూచిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ మార్పులు తన ఆలోచనా విధానాన్ని, మానసిక స్థితిని పూర్తిగా మార్చేశాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!