
ఆరోగ్యం

అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ యల్లమ్మ (38), ఆమె కుమారుడు చిన్నా (22) హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండగా, రెండో భార్య యల్లమ్మ. నల్లప్ప ఇటీవల మృతి చెందడంతో ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వివాదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నల్లప్ప మొదటి భార్య కుమారులే యల్లమ్మ, ఆమె కుమారుడిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం శింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!