

డిసెంబర్ 11న విశాఖపట్నం తీరంలో జరగనున్న మిస్సైల్ పరీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం NOTAM (Notice to Airmen) జారీ చేసింది. ఈ పరీక్ష కోసం మిస్సైల్ ప్రయోగ పరిధిని 1,050 కిలోమీటర్ల నుంచి 1,190 కిలోమీటర్ల కు విస్తరించినట్టు అధికారిక సమాచారం వెల్లడించింది. ముందుగా డిసెంబర్ 1-4 తేదీల్లో 3,485 కిలోమీటర్ల పరిధిని డేంజర్ జోన్ గా గుర్తించాలని కేంద్రం నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ పరీక్ష తర్వాత రద్దయింది.
విమానయాన రంగంలో NOTAM ల ప్రాధాన్యం ఎంతో కీలకం. ATC మార్పులు, రన్ వే మరమ్మతులు, ఎయిర్‌స్పేస్ మూసివేతలు, విమానాల కదలికలు, భద్రతా పర్యవేక్షణ వంటి ముఖ్యమైన అంశాలపై పైలట్లు మరియు విమాన సంస్థలకు ముందస్తు హెచ్చరికలు అందించడంలో NOTAM లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రాబోయే మిస్సైల్ టెస్ట్ నేపథ్యంలో NOTAM జారీ చేయడం భద్రతా చర్యల్లో భాగంగా చేపట్టిన ముందస్తు ఏర్పాట్లలో ఒకటి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!