
న్యూస్

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనవసర ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగశాఖ పౌరులకు సూచించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరుతూ, పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగే వరకు ఓర్పు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 800-46342 లేదా వాట్సాప్ +971543090571 ద్వారా సంప్రదించాలని అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలను కచ్చితంగా అనుసరించాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.


.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!