
సినిమాలు

కర్ణాటకలో కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై ఢిల్లీలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ పార్టీ అధిష్టానంతో సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. దాదాపు పది మంది పేర్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అదే సమయంలో రాజ్యసభ, శాసన మండలి స్థానాల కేటాయింపుపైనా చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యమైన పదవుల కేటాయింపుపై ఇంకా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అహింద వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని ఆయన సూచిస్తుండగా, అదనపు అధికార కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందని శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తొలి దశలో 10 నుంచి 20 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!