

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంకా మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమెను దక్షిణ కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ప్రియాంకా మోహన్ స్పందిస్తూ, కొరియా సంస్కృతి మరియు సంప్రదాయాలు తనకు ఎప్పటి నుంచో స్ఫూర్తినిస్తున్నాయని, ఇప్పుడు ఆ దేశ టూరిజం ప్రచారంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ చిత్రంతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంకా మోహన్, అంతర్జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు పొందడం విశేషంగా మారింది. అలాగే ఆమె నటించిన ‘మేడిన్ కొరియా’ చిత్రం కూడా దక్షిణ కొరియా నేపథ్యంలో తెరకెక్కడం ఈ నియామకానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!