

సౌదీ అరేబియాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన భయానక ప్రమాదం హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికుల ప్రాణాలను బలితీసుకుంది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ టాంకర్‌ను ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించి బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. ఆ బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తుండగా, మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డాడు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
మిగతా 45 మంది మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించి, న్యూ ఢిల్లీ టెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థించారు. సౌదీ అధికారులతో భారత దౌత్యవేత్తలు సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!