
క్రీడలు

తెలంగాణ వ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు 36 గంటలపాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం మరియు నిర్వహణ (మెయింటెనెన్స్) పనుల కారణంగా మీ-సేవా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మీ-సేవా వెబ్‌సైట్‌ను కూడా షట్‌డౌన్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ వ్యవధిలో ప్రజలకు అందించే సేవలు అందుబాటులో ఉండవని అధికారులు పేర్కొన్నారు. అవసరమైన సాంకేతిక మార్పులు పూర్తి చేసిన తర్వాత సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత మీ-సేవా వెబ్‌సైట్ మళ్లీ యాక్టివ్ అవుతుందని అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి అన్ని సేవలు సాధారణంగా కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!