
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కొలతూర్ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. గతంలో మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన స్టాలిన్, మరోసారి ఇక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నామినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన స్టాలిన్, డీఎంకే మరియు సెక్యూలర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ అభ్యర్థిగా కొలతూర్ ప్రజలు తనకు మరోసారి భారీ విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అలాగే ఈసారి కూడా తమ ప్రచారం బలంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!