

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక టెక్ సంస్థల డేటా కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. దుబాయ్‌లోని ఒరాకిల్ సంస్థ, బహ్రెయిన్‌లోని అమెజాన్ సంస్థ డేటా కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆరోపణలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ఖండిస్తూ, ఒరాకిల్ డేటా కేంద్రంపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అమెజాన్ తమ డేటా కేంద్రాలపై ప్రభావం పడిందని అంగీకరించింది. దీంతో కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల్లో నిర్ధారణ కాని వార్తలను ప్రచారం చేయవద్దని అధికారులు మీడియాను కోరారు. ఈ ఘటనతో టెక్ సంస్థల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
ఇటీవల ఇరాన్ సైనిక విభాగం అమెరికన్ టెక్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. కృత్రిమ మేధస్సు సహాయంతో లక్ష్యాలను గుర్తిస్తున్నాయని ఆరోపించింది. ఆపిల్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి సంస్థల పేర్లు తమ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. ఈ పరిణామాలు భవిష్యత్తులో టెక్ కంపెనీలు కూడా యుద్ధ రాజకీయాల్లో భాగమయ్యే అవకాశాన్ని సూచిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!